వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అగ్గి రాజేస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ పై అధిష్టానం గరం గరం ఉంది. దీంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ వారికి తగిన మూల్యం తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు మంత్రులు. మోసానికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా అంతా అధిస్టానం దగ్గరుందని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ పార్టీలో అంతర్గతంగా హీట్ పుట్టిస్తోంది. ఆమెను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే అభియోగంపై సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఆమె గత కొద్ది రోజుల నుంచి మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. ఇక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ఆమె సొంత పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు.
వైసీపీ గుండాలు తనను వేధిస్తున్నారని.. సంచలన కామెంట్స్ చేశారు. డాక్టర్ సుధాకర్ లాగే తనను చంపుతామని గుండాల నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. వాళ్ళ దందాలను తాను అడ్డు పడుతున్నానని అందుకే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను ఓటేసిన టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా.. లేదా సీసీ కెమెరాలున్నాయా.. అని ప్రశ్నించారు.
తను ఓటేసిన ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యేతో పాటు అసంతృప్తి ఎమ్మెల్యేలున్నారని.. వాళ్ల మీద ఎందుకు అనుమానం పడడం లేదని.. తననెందుకు వేధిస్తున్నారని ఆమె నిలదీశారు. పిచ్చి కుక్క లాగా నిందలేసి పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని.. నిన్నా మొన్నటి వరకు తనతో ఉన్న వాళ్లే ఇప్పుడు తన ఆఫీస్ పై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తనకు ప్రాణ హానీ ఉందని.. తనకు ఏమైనా అయితే సజ్జల రామ కృష్ణదే పూర్తి బాధ్యత అన్నారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తను దళిత ఎమ్మెల్యేను కాబట్టే ఇంత వివక్ష చూపిస్తున్నారన్నారు. ఇసుక మాఫియాకు తాను అడ్డు కాబట్టే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని.. తాను మాత్రం తన నియోజక వర్గం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.