ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు ఆలస్యంగా వస్తే జీతం కట్ చేయనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొంది.
ఒకవేళ సమయానికి హాజరు కాకపోతే సెలవు కింద పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు తగిన శాలరీ కట్ చేస్తామని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని.. సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఉదయం 10:10 గంటల నుంచి 11 గంటల వరకు హాజరయ్యేందుకు నెలలో మూడు సార్లు మాత్రమే అవకాశం కల్సిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాదని నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో భాద్యతగా వ్యవహరించాల్సి ఉంటోంది. దానికి తోడు పని వేళలను సమయానుకూలంగా పాటించాల్సి ఉంటోంది. ఉద్యోగులతో పని చేయించుకునే భాద్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.