ఆయన పని అయిపోయిందన్నారు. ఇక ఆయన ఏమీ చేయలేడన్నారు. ఆ పార్టీ దుకాణం మూసుకోవడమే అన్నారు. అలాంటిది ఆయన రాజధానిలో అడుగుపెడతాననగానే చిత్రంగా స్పందిస్తున్నారు. ఆయన రాకూడదంటూ.. అడుగు పెట్టకూడదంటూ కేకలు పెడుతున్నారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెడితే.. ముఖ్యమంత్రి సీఆర్డీయే రివ్యూ పెట్టారు. మంత్రి బొత్స.. రైతుల కోసం ఇచ్చిన జీవోలన్నీ అమలు చేస్తామని హామీ ఇస్తే.. ముఖ్యమంత్రి సీఆర్డీయే నిర్మాణాలను పొదుపుగా డబ్బులు వాడుతూ కొనసాగించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇతర నేతలైతే.. రాజధానికి నువ్వేం చేశావు.. తాత్కాలిక నిర్మాణాలు కూడా దారుణం అంటూ విరుచుకుపడుతున్నారు.
ఆర్టీసీపై కేసీఆర్ ఆటలకు గడ్కరీ చెక్!
చంద్రబాబునాయుడు రాజధానిలో పర్యటిస్తాననగానే ఇన్ని ప్రకంపనలు ఎందుకొస్తున్నాయో ఎవరీ అర్ధం కావడం లేదు. వైసీపీ బాబు పర్యటనకు ఇంతలా ఎందుకు స్పందిస్తుంది? ఇంతలా భయపడుతున్నదెందుకో తెలియటం లేదు.
ఇప్పటివరకు రాజధాని అమరావతిలో ఒకట స్వరం వినపడింది. రాజధానిని అభివృద్ధి చేయండి.. మా త్యాగానికి అన్యాయం చేయకండి అనే మాటలు వినపడ్డాయి. కాని చంద్రబాబు పర్యటన గురించి ప్రకటించాక.. మరో స్వరం వినపడింది. ఆయన మాకు ద్రోహం చేశాడు.. ఎన్నో చేస్తానని భూములు తీసుకుని.. ఏమీ చేయకుండా వెళ్లిపోయాడు.. ఏ మొహం పెట్టుకుని వస్తాడు.. మాకు క్షమాపణ చెప్పాకే అడుగు పెట్టాలి అంటూ కొందరు రైతులు ఘాటుగా విమర్శలు కురిపించారు. మొన్నటివరకు ఒకే సామాజికవర్గం ఆ ప్రాంతంలో ఉందన్న వైసీపీనే… ఇప్పుడు తమ పార్టీవారిని పోగేసి.. అందులోనూ దళితులను సమీకరించి.. ఈ ప్రెస్ మీట్లు పెట్టించింది. దళితులకు చెందిన అసైన్డ్ ల్యాండ్ల విషయంలో మరింత అన్యాయం చేశారంటూ కూడా విమర్శలు కురిపించింది.
మహేష్‌బాబు సోదరిపై గౌతమ్‌మీనన్ సంచలన వ్యాఖ్యలు
వీరు మాట్లాడుతున్న సమయంలోనే.. 29 గ్రామాల రైతులు తుళ్లూరులో సమావేశమయ్యారు. వారంతా ముఖ్యమంత్రిని కలిసి రాజధాని అభివృద్ధిపై మాట్లాడాలని, స్పందించకపోతే ఆందోళనలకు దిగాలని తీర్మానం చేశారు. చంద్రబాబు వస్తే అడ్డుకుంటామనేవాళ్లు వైసీపీ వాళ్లు మాత్రమేనని వారు తేల్చేశారు. తాము జగన్, పవన్ ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతామని చెప్పారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలైతుందా…?
రాజధానిలో ఈ పరిణామాలకు కారణం.. జగన్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ అని తెలుస్తోంది. రాజధాని అమరావతిని కనక నిర్లక్ష్యం చేస్తే.. తెలుగుదేశానికి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో మళ్లీ ఊపిరి పోసినట్లేనని కొందరు ఆయనకు వివరించారట. కనీసం పెండింగ్ లో ఉన్న పనులను మమ అనిపించినా.. ఏదో ఒకటి నడుస్తుందనుకోవచ్చని వారు సలహా ఇచ్చారట. అంతే కాదు.. అమరావతిని ఇండియా మ్యాప్ లో చూపించి.. బిజెపి స్ట్రాంగ్ సిగ్నల్ నే జగన్ కు ఇచ్చిందని.. రాజధానిని మారిస్తే.. కేంద్రం కూడా ఊరుకోదని వారు వివరించినట్లు తెలుస్తోంది.
తమ్మినేని సీతారాం స్పీకరా, బ్రోకరా…సుంకర పద్మశ్రీ
అందుకే జగన్.. నిర్మాణాలను కొనసాగించాలని.. ప్రాధాన్యతక్రమంలో చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే ఇవన్నీ నామమాత్రమే.. ఇప్పటికే 50 నుంచి 80 శాతం దాకా పూర్తయిన భవనాలను .. కంప్లీట్ చేయమన్నారు. కొత్త బిల్డింగులేమీ మొదలుపెట్టమనలేదు. అయినంతవరకు ఇక్కడ కానిచ్చి.. రైతుల ప్లాట్ల వరకు అభివృద్ధి చేసి.. రాజధానికి సంబంధించిన మిగిలిన ఆఫీసులన్నీ తాడేపల్లి, మంగళగిరి రోడ్డులోనే పెట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నాగార్జున యూనివర్శిటీనే వారి ఆలోచనల్లో ఉంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న డిపార్టమెంట్లన్నీ.. ఇక్కడికే వెళతాయని అంటున్నారు.
శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు-అధికారుల హస్తం
మొత్తం మీద చంద్రబాబునాయుడు పర్యటన.. ఇన్ని ప్రకంపనలు సృష్టించింది. ఆక ఆయన పర్యటన తర్వాత కొత్తగా ఏమీ జరగదు కూడా. కేవలం ఆయన జగన్ పై చేసే విమర్శలే హైలెట్ అవుతాయి తప్ప.. ఆయన పర్యటించకముందే.. జరగాల్సింది జరిగిపోయింది.