ఏపీలో వైసీపీ నేతల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు.. నలుగురిలో పెట్టి ఒకరిని దూషించడం అలవాటుగా మారిపోయింది. తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో మహిళ అధికారిని వైసీపీ నేత తీవ్రపద జాలంతో దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాతాజీ.. ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించారు. జడ్పీటీసీకి ప్రోటోకాల్ పాటించటం లేదు.. మేం చెప్పినట్లు వినకపోతే చీరేస్తామంటూ మహిళా ఎంపీడీవో విజయపై బూతుపురాణం మొదలు పెట్టారు. కార్యాలయంలో ఉన్న సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా.. అవేవి పట్టంచుకోకుండా తీవ్రపదజాలంతో దూషించారు. దీంతో ఎంపీడీవో బోరున విలపించారు. అనంతరం తనను వైకాపా నేత దూషించారని..తనకు రక్షణ కల్పించాలని.. అమలాపురం ఆర్టీవో వసంతరాయుడుకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు.