నటుడు, వైసీపీ నేత కృష్ణుడు తండ్రి అల్లూరి సీతారామరాజు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారామరాజు కన్నుమూశారు. కృష్ణుడు తండ్రి మరణించాడని తెలుసుకున్న వైసీపీ నేతలు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
కొంతకాలంగా కృష్ణుడు సినిమాలకు దూరంగా ఉంటూ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృష్ణుడు పనిచేశారు.