నా డబ్బు నాకు ఇవ్వకపోతే రాజధాని ప్రాంతంలో మొదటి ఆత్మహత్య నాదే… వైసీపీ నేత
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల సమయంలో కోటి 40 లక్షల రూపాయలు తీసుకుని 60 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తుందంటూ ఆ పార్టీ నాయకుడు మేకల రవి ఆరోపించారు. పార్టీపై ప్రేమతో ఎమ్మెల్యే శ్రీదేవి కి డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇస్తే కనీసంవిలువ లేకుండా మాట్లాడుతుందని.. జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు లక్షల రూపాయలు తమ వద్ద వసూలు చేసిందని రవి ఆరోపించారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే కుటుంబ సభ్యుల చేత దాడి చేయించిందని ఆరోపించారు. అవమానం భరించలేక చచ్చిపోవాలని నిర్ణయించుకుని పిల్లల ముఖం చూసి ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాన ని తొలి వెలుగు తో కన్నీరు పెట్టుకున్నాడు.
పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు లో కమిషన్ వస్తాది అని పేదల భూముల్లో కమిషన్ వచ్చిన డబ్బులు ఇస్తానంటూ ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారని తెలిపారు.. నాకు రావాల్సిన 80 లక్షల రూపాయలు ఇవ్వకపోతే రాజధాని ప్రాంతంలో మొదటి ఆత్మహత్య తనదేనని హెచ్చరించారు మేకల రవి. వీటితో పాటు మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.