సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి
టీడీపీ తప్పుడు విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కుట్రలను నమ్మడం లేదు. పరిషత్ ఫలితాలతో మా బాధ్యత మరింత పెరిగింది. భారీ విజయాల్లో చిన్నచిన్న నాయకత్వ సమస్యలు సహజమే. జగన్ నాయకత్వంపై ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు. సంక్షేమ పాలనకు తాజా ఫలితాలే నిదర్శనం. పదవుల్లో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. పార్టీతోపాటు నేతలంతా క్రమశిక్షణగా ఉన్నారు.
అసలు విపక్షంలోని అందరూ వలస పక్షులే. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఇక్కడికొచ్చి ఒకపూట ఉండి వెళ్లిపోతారు. నారా లోకేష్ దీ అదే తీరు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ పోరాటం చేసి విజయం సాధిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. బీజేపీతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని స్టీల్ ప్లాంట్ అంశంలో సానుకూల ఫలితం తీసుకువస్తే ఆ క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవచ్చు.