వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏపీలో టీడీపీ ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కర్రలతో గుంపుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అలాగే విజయవాడ, విశాఖ ఆఫీసులపైనా దాడులు జరిగాయి.
ఇక రోజూ వైసీపీపై విమర్శల దాడి చేసే పట్టాభిరాం ఇంట్లోకి చొరబడిన వైసీపీ కార్యకర్తలు.. కారు, బైక్ ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇటు సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.