గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సీఎం జగన్ పుట్టినరోజు ర్యాలీ సందర్భంగా బస్టాండ్ వద్ద హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో పలువురు యువకులను వైసీపీ కార్యకర్తలు కర్రలతో చితకొట్టారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని.. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదని అన్నాడు. మాకే ఎదురు సమాధానం చెబుతావా..? అంటూ ఆగ్రహంతో వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటనపై టీడీపీతోపాటు అన్ని వర్గాలకు చెందిన దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.