ఓ వైసీపీ ఎమ్మెల్యే పై కార్యకర్తలకు ఉన్న అభిమానం ప్రతిపక్షాల విమర్శకుతావిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుకలను పూలమాలలు, కేకు కటింగ్ వంటి హంగామా లేకుండా శుభాకాంక్షలు తెలపాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారట. ఇందుకు భిన్నంగా పెదపూడిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహంతో బహిరంగంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఐదుగురు అమ్మాయిలతో డ్యాన్సులు చేయించారు. అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన అధికారులు అధికారపార్టీ కావటంతో నోరుమెదపలేదు. విచిత్రం ఏంటంటే ఈ వ్యవహారం అంత పోలీస్ స్టేషన్ కు అతిసమీపం లో జరుగుతున్న ఎవ్వరు పట్టించుకోలేదు.