ఏపీలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మద్యం మత్తులో పోలీసులుపై వీరంగం సృష్టించారు కొంత మంది వైసీపీ నేతలు. పోలీసు వాహనం వద్ద మద్యం బాటిల్ పగలకొట్టి వాహనం సీటుపై బిర్యానీ పెట్టి రచ్చ రచ్చ చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక పాకలపాడు వైసీపీ ఎంపీటిసి భర్త యళ్ల నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ నానాజీ లు మాకవరపాలెం ఆర్ ఆర్ రెస్టారెంట్ లో ఫుల్ గా మద్యం సేవించారు.
ఆ తరువాత ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దీనితో పోలీసులకు రెస్టారెంట్ ఓనర్ ఫోన్ చేశాడు.పోలీసులు వచ్చినా ఆ ఇద్దరి వైసీపీ నేతలు ఆగలేదు. అంతకు మించి రెచ్చిపోయి పోలీసుల పైనే తిరగబడ్డారు.
అధికారపార్టీ నేతలం, మాకు ఎమ్మెల్యే తెలుసు అంటూ పోలీసులపై దుర్భాషలాడుతూ ఇస్తాను సారంగా మాట్లాడారు, మీరు మమ్మల్ని ఏమి చెయ్యలేరు అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు.