నేర చరిత్ర ఉన్న రాజకీయవేత్తలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అలాంటి నేతలను మోస్తున్న రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో ఆ కళంకిత నేతలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 48 గంటల్లోనే వారి వివరాలను వెబ్‌సైట్లలో పెట్టాలని ఇవాళ ఆదేశించింది. ఎటువంటి నేతలపై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాలను తమ తమ వెబ్‌సైట్లలో పొందుపరుచాలని కోర్టు తన తీర్పులో రాజకీయ పార్టీలను ఆదేశించింది. రాజకీయల్లో క్రిమినల్స్ పెరుగుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రాజకీయ పార్టీలకు ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సగానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, సాక్ష్యత్తు స్పీకర్ పై కూడా క్రిమినల్ కేసు ఉంది. 9 మంది ఎంపీ లపై కూడా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వైసీపీ లో క్రిమినల్ కేసులు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ల వివరాలు..
YS జగన్ ముఖ్యమంత్రి 31 కేసులు
కన్నబాబు వ్యవసాయశాఖ మంత్రి. 3 కేసులు
కొడాలి నాని. సివిల్ సప్లై మంత్రి. 4 కేసులు
పేర్ని నాని. I&PR మంత్రి. 2 కేసులు
అనిల్ కుమార్ ఇరిగేషన్ మంత్రి. 2 కేసులు
బుగ్గన. ఆర్థిక శాఖ మంత్రి. 2 కేసులు
సురేష్ విద్యా శాఖ మాంత్రి. 2 కేసులు
గౌతమ్ రెడ్డి. పరిశ్రమల శాఖ మంత్రి. 3 కేసులు
శంకర నారాయణ బీసీ సంక్షేమ శాఖ. 6 కేసులు
శ్రీనివాస్ రావు. దేవాదాయశాఖ మాంత్రి. 2 కేసులు
మోపిదేవి. పశుసంవర్ధక శాఖ మంత్రి. 2 కేసులు
బాలినేని. అటవీశాఖ మంత్రి. 2 కేసులు
అంజత్ బాషా. ఉప ముఖ్యమంత్రి. 3 కేసులు
గోరంట్ల మాధవ్ ఎంపీ. 2 కేసులు
విజయ్ సాయి రెడ్డి ఎంపీ. 13 కేసులు
చంద్ర శేఖర్. ఎంపీ. 4 కేసులు
MVV సత్యనారాయణ. ఎంపీ. 1 కేసు
రంగయ్య. ఎంపీ. 1 కేసు
అవినాష్ రెడ్డి. ఎంపీ. 4 కేసులు
బలశౌరీ. ఎంపీ. 2 కేసులు
బ్రహ్మానంద రెడ్డి. ఎంపీ. 1 కేసు
రఘురామ కృష్ణంరాజు. ఎంపీ. 6 కేసులు
మాగంటి భరత్. ఎంపీ. 2 కేసులు
మిథున్ రెడ్డి. ఎంపీ. 3 కేసులు
ధర్మాన ప్రసాదరావు. ఎమ్మెల్లే. 2 కేసులు
దాడిశెట్టి రాజా. ఎమ్మెల్లే. 15 కేసులు
మొత్తం 150 మంది వైసీపీ ఎమ్మెల్యే లలో 86 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని అఫిడవిట్ లో ప్రకటించారు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న నేతలు ఉన్నారు. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీల నేతల అసలు రంగు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి