టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విద్యార్థులతో చేసిన జూమ్ మీటింగ్ చర్చనీయాంశంగా మారింది. దానికి కారణంగా విద్యార్థులకు బదులు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవేందర్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయ్యారు. దీంతో ఇది కాస్తా రాజకీయ దుమారం రేగింది.
వైసీపీ నేతలపై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు విద్యార్థులకు తాము భరోసా కల్పిస్తుంటే చూసి ఓర్వలేక తమ కార్యక్రమాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. దీంతో వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చారు.
అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి లోకేష్ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయవద్దని చెప్పడానికే జూమ్ మీటింగ్ లో పాల్గొన్నామని చెప్పారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై లోకేశ్ తో బహిరంగంగా చర్చించేందుకు తనకు ఎలాంటి భయం లేదని కొడాలి నాని సవాల్ చేశారు.
తన ఐడీతో డైరెక్ట్ గా వెళితే లోకేశ్ మాట్లాడడు కాబట్టే.. తన మేనల్లుడు లింక్ ద్వారా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపారు.