మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్ల రూపాయలు స్వాదీనం చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఐటి శాఖ తేల్చి చెప్పింది. శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సోదాల్లో మొత్తం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. దానికి సంబందించిన పంచనామా నివేదిక పై ఐటి అధికారుల సంతకాలతో పాటు పీఎస్ శ్రీనివాస్ సంతకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరో వైపు చంద్రబాబు పీఎస్ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడ్డదంటూ అధికార పక్ష నాయకులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పంచనామా నివేదికతో వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ప్రజలు అర్ధం అయిందని టీడీపీ నాయకులు అంటున్నారు. తాజాగా దాడులకు సంబంధించి పంచనామా నివేదిక రావటంతో అధికారపార్టీ నాయకులు ఏమేర స్పందిస్తారో చూడాలి.