విజయవాడ : జగన్ చెప్పాడు.. మంత్రులు పాటిస్తున్నారు. కానైతే.. ఆ కంగారులో సానియా మీర్జాని కాస్తా పీటీ ఉషని చేసి పారేశారు. మేటరేంటంటే.. స్పోర్ట్స్ డే సందర్భంగా జాతీయస్థాయి గౌరవాలు అందుకున్న వారిని గౌరవించుకుందామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల క్రితం ఒక మీటింగులో అన్నారు. పద్మ పురస్కారాలు అందుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్ని గుర్తించి క్రీడాదినోత్సవం రోజు వారికి ఘనంగా సత్కారం చేయిద్దాం… అని చెప్పారు. ఇలా క్రీడాకారుల్ని గౌరవించే కొత్త సంప్రదాయాన్ని ఆరంభిద్దాం.. అన్నట్టుగా జగన్ మాట్లాడారు. కానీ.. గతంలో చంద్రబాబు కూడా అవసరం వున్నా లేకపోయినా క్రీడాకారులకు ప్రభుత్వ ఖజానా నుంచి బాగానే ముట్టజెప్పారు. వారంతా హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చే బ్యాచ్ కాకపోయినా ఏపీలో ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టి ఘన సత్కారాలు, భారీ నగదు పురస్కారాలు, ఇళ్ల స్థలాలు, అకాడమీలకు ఉచితంగా స్థలాలు, గ్రూప్ వన్ కొలువులు.. వాట్ నాట్? అన్నీ ఇచ్చారు. జగన్ కూడా చంద్రబాబు బాటలో క్రీడాకారుల్ని గౌరవించాలంటూ ఆర్డరేయడంతో అధికారులు మళ్లీ ఆ లిస్టులో అందర్నీ పిలిపించే పనిలో పడ్డారు. అదంతా అలా వుంటే క్రీడామంత్రి తన శాఖ ద్వారా రూపొందించిన బ్యానర్లలో సానియా మీర్జా ఫోటో పెట్టి కింద పీటీ ఉష అని పేర్కొనడమే పెద్ద పిటీ !