మైకులు మాట్లాడించేస్తున్నాయి.. కెమెరాలు కనిపెట్టేస్తున్నాయి. రహస్యాలను బట్టబయలు చేసేస్తున్నాయి. జనానికి తెలిసిన విషయాలే రికార్డు చేసేసి.. చట్టానికి అప్పగించేస్తున్నాయి. వాడుకోవడానికే కులం తప్ప.. మతం మాత్రం వేరేది. అధికారం కోసం అది కావాలి… దండం పెట్టుకోవడానికి వేరే కావాలి. మతం మారితే.. ఎస్సీ రిజర్వేషన్ అమలు కాదు అనే నిబంధన ఇప్పుడు వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. వారి పదవులకే ప్రమాదం తెచ్చిపెడుతోంది.
ఒకే దెబ్బకు హైపర్ ఆది రెండు షోలు
ఎస్సీ కులానికి చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది క్రిస్టియానిటీ పుచ్చుకున్నారనేది చాలామంది చెప్పుకుంటారు. అయితే పదవుల కోసం రిజర్వేషన్ కావాలి కాబట్టి.. ఈ విషయం బహిరంగంగా ఉండదు. ఉంటే.. పదవి పోతుంది. అందుకే రికార్డులకు ఈ విషయంలో మామూలుగా దొరకరు. వారు రెగ్యులర్ గా చర్చికి వెళతారు కాని.. ఇంట్లో ఏసు ఫోటో కూడా పెట్టరు. మ్యారేజ్ కూడా చర్చిలోనే చేసుకుంటారు.. కాని ఆ ఫోటోలు ఎవరికీ దొరకనియ్యరు.. కేవలం రిజిస్టర్ మ్యారేజ్ రికార్డులే చూపిస్తారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాని వైసీపీ నేతలు మాత్రం దొరికిపోతున్నారు.
తెలంగాణ ఏపీలో బీజేపీ మహా రాజకీయం..
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆ మధ్య వినాయకచవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆమెతో ప్రారంభోత్సవం చేయించడంపై వివాదం చెలరేగింది. ఆమె క్రిస్టియానిటీ మతం పుచ్చుకుందని నమ్ముతున్న కొందరు.. ఆమెను పిలవడాన్ని తప్పు బట్టారు. ఎమ్మెల్యే అయినా.. హిందూ మతం కానప్పుడు వినాయకచవితి ఉత్సవానికి హాజరు కావచ్చు కాని.. ప్రారంభోత్సవం చేయడం ఏంటని వాదించారు. దీనిపై వాదోపవాదాలు జరిగాయి.. ఎమ్మెల్యే శ్రీదేవి హర్టయ్యారు. ఇదంతా టీడీపీవారే చేశారని.. దళితురాలినైన తనను అవమానించారంటూ వాపోయారు. దీనిపై వైసీపీ రెండురోజులపాటు హడావుడి చేసింది. అదే ఇప్పుడు శ్రీదేవి కొంప ముంచేలా ఉంది.
ఏపీలోకి ఎంటరైన సీబీఐ
ఈ గొడవతో శ్రీదేవి దళితురాలా .. లేక క్రిస్టియనా అనే చర్చ మొదలైంది. ప్రత్యర్ధులు ఊరికే ఉంటారా? పావులు కదిపారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆర్డనైజేషన్ ను పట్టుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ ని అని శ్రీదేవి చెప్పిన రికార్డు తీసుకుని.. ఏకంగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అక్కడి ఆదేశాలతో.. ఇక్కడ విచారణ జరుపుతున్నారు.
కల్వకుంట్ల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
ఇక హోంమంత్రి మేకతోటి సుచరితది ఇదే తంతు. ఆమె కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ లో క్రిస్టియానిటీ తీసుకున్నట్లు చెప్పిన రికార్డు దొరికింది. ఇప్పుడు ఆమె మీద కూడా కేసు నమోదైంది. ఇవన్నీ నిబంధనల ప్రకారం జరిగితే.. వీరిద్దరు పదవులు కోల్పోతారు. ఏమైనా లొసుగులుంటే.. తప్పించుకోగలుగుతారు తప్పితే.. కష్టమే.
ఇప్పుడు వీరిద్దరి కేసులు చూసిన ప్రత్యర్థులు… మొత్తం వైసీపీలో ఉన్న ఎస్సీ నేతల గురించి ఆరా తీస్తున్నారు. ఎక్కువమంది క్రిస్టియానిటీ పుచ్చుకున్నవారేనని వీరి నమ్మకం. అయితే ఆధారాల కోసం వేట మొదలైంది. అదే జరిగితే.. చాలా పెద్ద నష్టమే జరుగుతుంది వైసీపీకి.