రాజధాని వికేంద్రీకరణ బిల్ కి గవర్నర్ ఆమోదంపై వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి ఇదొక మైలురాయన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలు ఆనందంగా ఉంటారు. హైదరాబాద్ ల ఒకే చోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అమరావతి పేరుతో కాలయాపన చేసిందని అన్నారు.మరో వైపు కారణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకణ ఆమోదం కి మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వైసీపీ కి భవిష్యత్ ని ఇస్తుందని నమ్ముతున్నామని కొనియాడారు. అభివృద్ధి వికేంద్రీకణ అంశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరు హర్షిస్తున్నారు.వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదం టిడిపి కి గొడ్డలి పెట్టు అని చెప్పుకోవచ్చుని పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా
తాడేపల్లిగూడెం ఎమ్మేల్యే సత్యన్నారాయణ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణ గా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ గారు ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యం తో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారని ప్రజలందరికి జగన్మోహన్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ గారి నిర్ణయాలే తెలియచేస్తున్నాయన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంద్ర రాష్ట్రాన్ని భారతదేశం లొనే ప్రముఖ మైన రాష్ట్రం గా తీర్చిదిద్దుతారని ఖచ్చితంగా తెలుస్తోందని కొనియాడారు.