గేట్ లోపల విద్యార్థులు,గేట్ బయట టీచర్లు!!
జెడ్పీ హైస్కూల్ ఎదుట వైఎస్సార్ సిపి నాయకుల ధర్నా!!
ఎమ్మెల్యే అంబటి రాంబాబు చొరవతో ఆందోళన విరమించిన నాయకులు!!
సత్తెనపల్లి మండలం పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ లో నిర్ణీత వేలకు స్కూల్ కు రాని టీచర్లు మాకోద్దు అంటూ వైసీపీ నిరసనకు దిగారు. 100 శాతం రిజల్ట్ తీసుకురాలేని టీచర్లు, చదువు చెప్పలేని టీచర్లు మాకోద్దు అని నినాదాలు చేశారు. హైస్కూల్ గేట్ కు తలుపులేసి ఆందోళనకు దిగారు.
ఈ ఆందోళనల్లో వైసీపీ నాయకులు కోటిరెడ్డి ,పాటశాల విద్యా కమిటీ చైర్మెన్ సానికొమ్ము సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ విజయ కుమారి,గ్రామ ప్రజలు,వాలంటీర్లు పాల్గొన్నారు.
ఉపాథ్యాయులు లక్షలలక్షల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉథ్యమాలు చేస్తూ పాటలు పాడుతూ డాన్సులు చేస్తున్నారని, ఇలాంటి వారు మాకోద్దు అని వారు నినాదాలు చేశారు.
అయితే ఆ తరువాత అంబటి రాంబాబు జోక్యం చేసుకోవడం తో వైసీపీ నాయకులు ఆందోళన విరమించారు. ఇక ఈ సంఘటనపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘలు ఎలా స్పందిస్తాయో చూడాలి.