ఏపీలో చీప్ లిక్కర్ ధరకే తెలంగాణలో బ్రాండ్ మద్యం లభిస్తోంది. దీంతో సరిహద్దులోని వారంతా తెలంగాణ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరగడం ఒక ఎత్తు అయితే టైం స్లాట్ పెట్టడం, ధర ఎక్కువగా పెట్టినప్పటికీ ఇష్టమైన బ్రాండ్స్ దొరకకపోవడంతో మద్యం ప్రియులు కూతవేటు దూరంలో ఉండే సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి కావాల్సినకాడికి మద్యాన్ని తీసుకుని తాగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లా వాసులు కృష్ణా గుంటూరు జిల్లా వాసులకి తెలంగాణ బోర్డర్ చాలా తక్కువ దూరంలో ఉండటంతో అందరూ అక్కడికి వెళ్లి చీప్ గా దొరికే మందు తాగడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలకి వెళ్లి మద్యం తీసుకోని తాగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతుంది. దానికి తోడు తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం రాత్రి 8 తరువాత మద్యం దొరకకపోవడంతో సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని చీప్ గా అమ్ముతున్నారట. ఈ భారీ స్కామ్ లో ఏపీకి చెందిన ఇద్దరు మంత్రుల హస్తం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రభుత్వమే మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకొని దశలవారీగా మద్యాన్ని పూర్తిగా రాష్ట్రం నుండి తీసేయాలని చూస్తున్న తరుణంలో రాష్ట్ర మంత్రులే పక్క రాష్ట్రాల నుండి మద్యాన్ని తెప్పించి చీప్ గా అమ్మకాలు ప్రారంభిస్తే ఏపీ సర్కార్ తీసుకున్న మద్యపాన నిషేధాన్ని ఎలా పూర్తి చేస్తుందో చూడాలి. అయితే ప్రస్తుతం ఏపీలో లిక్కర్ దందా చేస్తున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరంటూ విపరీతంగా చర్చ నడుస్తోంది. మరో వైపు ఆ ఇద్దరు మంత్రుల వెనుక జగన్ హస్తం కూడా ఉందంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి . మరి నిజంగా జగన్ హస్తం ఉందా లేక జగన్ కు తెలియకుండా చేస్తున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది.