ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులంటూ జగన్ ప్రకటన చేసిన తరువాత ఏపీ రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరలించవద్దంటూ రాజధాని ప్రాంత రైతులంతా ధర్నాలు చేస్తుంటే వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మూడు రాజధానులకు మద్దతుగా రాజమండ్రి లో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి మూడు రాజధానులు కాదని.. నాలుగు కావాలని డిమాండ్ చేశారు. ఏపీకి సాంస్కృతిక రాజధాని గా రాజమండ్రి ని చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి నాలుగు రాజధానులు ఉంటే బాగుంటుందనే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. రాజమండ్రి ని సాంస్కృతిక రాజధాని గా మార్చాలని కోరుతానని తెలిపారు.