ఓటుకు నోటు మరోసారి తెరపైకి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. 2017లో ఓటుకు నోటు అంశంపై సుప్రీంను ఆశ్రయించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. అయితే… ఆ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. దాంతో ఆ పిటిషన్ ఎటూ తెలకుండా ఉండిపోయింది.
ఆనాటి పిటిషన్‌ను విచారించాలని ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని తన పిటిషన్‌లో ఎమ్మెల్యే ఆర్కే కోరారు. న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు.