గుంటూరు: ఏపీపీఎస్‌సీ నిర్వహించిన సచివాలయ కార్యదర్శుల నియామకాల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, పెద్దిరెడ్డి పేపర్ అమ్ముకున్నారని తండ్రి కొడుకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీసీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు చెప్పారు. కావాలనే ఒక పిచ్చి పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని, అ పిచ్చి పత్రిక రాతలు ఎవరు నమ్మొద్దని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి పట్టు పట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహింపచేశారని, లక్ష 27 వేల గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారని అంబటి ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. పేపర్ లీక్ అయితే లీక్ అయిన రోజే వార్త ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. రిజల్ట్ వచ్చిన తరువాత ఎందుకు పేపర్ లీక్ అయ్యింది వార్తలు రాస్తున్నారని,ఈ పరీక్షలో సామాన్య కుటుంబాలకు చెందిన వారికి ప్రధమ ర్యాంకులు వచ్చాయని చెప్పారు.