తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ కనిపించిన మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి కరోనా కలకలం రేపింది. మొన్నే ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ తేలగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటగివ్ నిర్ధారణ అయింది. అంబటి కరోనా రావడం ఇది రెండోసారి.
గత జులై నెలలోనే కరోనా బారినపడ్డ అంబటి.. ఆతర్వాత కోలుకున్నారు. నిన్న అసెంబ్లీలో కరోనా టెస్టులు చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ అని తేలింది. రెండోసారి కరోనా సోకడంపై అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరి ఆశీస్సులతో త్వరలో కరోనాను జయిస్తానంటూ ట్విట్టర్‌లో తెలిపారు.
జులైలో నాకు కోవిద్ వచ్చి
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020
Advertisements