ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోనే కొనసాగించాలంటూ ఏడాది నుంచి రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతుల పోరాటం పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి లాగా విశాఖ కుల నగరం కాదని అమరావతి రాజధాని కావాలంటే టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని అన్నారు. అమరావతి ఉద్యమంలో మేకప్, లిఫ్ స్టిక్ మాత్రమే కనిపిస్తున్నాయని బడుగు బలహీన వర్గాలు మాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ, బీజేపీ మధ్య అనుబంధం లేదని రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారని.. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు.. జాతి నాయుకుడని అన్నారు. చంద్రబాబు13 జిల్లాలకు కాదు..29 గ్రామాలకు కూడా నాయుకుడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్