మహాత్మాగాంధీ గారి 150వ జయంతి.. అంటే దాదాపుగా 70 సంవత్సరాలయ్యింది, ఆయన జన్మించి..!
150వ జయంతి ఏమిటి..? ఆయన జన్మించి 70 సంవత్సరాలేంటి..? అని అనుకోకండి. ఈ మాటలన్నది వైసీపీ ఎమ్మెల్యే రజనీ.
మహాత్మాగాంధీ జయంతి రోజున టీడీపీ నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఆ మరుసటి రోజు రజనీ ప్రెస్‌మీట్ పెట్టి ఏకిపారేద్దామనుకున్నారు. కాకపోతే, టాకింగ్ పాయింట్స్‌కు సంబంధించి సరైన హోమ్ వర్క్ చేయకపోవడం వల్లనో, లేక జీవీడీ టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ యాజిటీజ్‌గా చదవడంలో తడబడ్డారో.. మరి తనే రైట్ అనుకున్నారో కానీ, గాంధీ గారు జన్మించి 70 సంవత్సరాలు అయ్యిందని ఎమ్మెల్యే రజనీ సెలవిచ్చారు.
‘150 వ జయంతి అంటే ఆయన పుట్టి 70 సంవత్సరాలు అన్నమాట..’ అని రజనీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అప్పుడెప్పుడో టీడీపీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ బీకామ్‌లో ఫిజిక్స్ అంటూ ఇలానే ఓ మాట అనేసి ఆనక ఇప్పటికీ జనం నోట్లో నానుతున్నాడు.
బీకామ్‌లో ఫిజిక్స్ అనే మాట ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆ టైటిల్‌తో కాలేజ్ స్కిట్స్, జబర్దస్త్ కామెడీ షోలు, సినిమా పాటలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు రజనీ డైలాగ్ కూడా జలీల్ ఖాన్ వ్యాఖ్యలతో పోటీపడుతోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు కింద పెడుతున్న కామెంట్లు కూడా బాగా సెటైరికల్‌గా వున్నాయి. ‘వైసీపీకి 50 శాతం డిస్కౌంట్ అలవాటే. అమ్మఒడి ఇద్దరు పిల్లలకు ఇస్తామని ప్రామిస్ చేసి ఒకరికి ఇస్తున్నారు. రైతు భరోసా 12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,500 ఇస్తామన్నారు. కౌలు రైతులందరికీ ఇస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ క్రిస్టియన్, ముస్లిం కౌలు రైతులకే అంటున్నారు…’ అంటూ ఒక నెటిజెన్ కామెంట్ పెట్టాడు.
50% Discount has become habbit for ysrcp
AMMAVADI -Promised for 2 Child’s, Giving for 1 Child
Rythu Bharosa – Promised 12,500 now saying 6,500
Promised for All tenant farmers-Now for SC ST Christian Muslim Farmers
ఆ వీడియోలో రజనీ ఏమన్నారో మీరే చూడండి..