ఇటీవల హైటెక్ సిటీలో ఓ బెంజ్ కారు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. పబ్ లో అర్ధరాత్రి వరకు తప్పతాగి సిగ్నల్ జంప్ చేస్తూ బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మరణించగా… భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీనిపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు.
డ్రంకన్ డ్రైవ్ తో ప్రమాదానికి గురైన కారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో ఈ ఓబుల్ రెడ్డిని కావాలనే తప్పించారన్న ప్రచారం కూడా సాగింది. తాజాగా ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే స్పందించారు. కారు రిపేర్ ఉందని గ్యారేజ్ లో ఇవ్వగా… ఓబుల్ రెడ్డి ఫ్రెండ్ కౌశిక్ కారు పికప్ చేసుకున్నారన్నారు. కానీ వెంటనే తిరిగి ఇవ్వలేదని… ఫ్రెండ్స్ తో పబ్ కు వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో ఓబుల్ రెడ్డిని ఇరికించాలని చూశారని, కానీ తాను ప్రమాదం జరిగిన రోజు బనగానపల్లెలో పాదయాత్రలో ఉన్నారని ఎమ్మెల్యే కాటసాని స్పష్టం చేశారు.