చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ విమర్శించారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే నన్ను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, గతంలో మమ్మల్ని మార్షల్స్ తో బయటకి నెట్టేశారంటూ మండిపడ్డారు. నా సస్పెండ్ కరెక్ట్ కాదని సుప్రీం కోర్ట్ చెప్పినా వినలేదని, హైకోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి రానివ్వలేదు…ఈడ్చుకెళ్లి కార్లో పడేసారన్నారు. అధికారం పోయాక కూడా చంద్రబాబు అదే ఆలోచన ధోరణితో ఉన్నాడు. చంద్రబాబుకి వయస్సు మీదపడే కొద్దీ చాదస్తం పెరుగుతుందని విమర్శించారు.
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడ వేడిగా కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా…పనికిమాలిన నాయకుడా అనేది నాకు అర్ధం కావట్లేదంటూ చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు రోజా.