టీడీపీ హయంలో రెడ్లను తొక్కేశారంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. కాకినాడలో రెడ్డి సాామాజిక వర్గ కార్తీక సమారాధన లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. రెడ్డి సామాజిక వర్గీయులు ఇంత ఆనందంగా కార్తీక వన సమారాధనలు చేసుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డే అన్నారు. గతంలో నాయకులు వాళ్ళ సామజిక వర్గానికి చెందిన వాళ్ళను మాత్రమే చూసుకున్నారు తప్ప ఇతరులను పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు.