ఇసుక కొరతపై నారాలోకేష్ దీక్ష చెయ్యటం విడ్డురంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబు, లోకేష్ ల పై విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఇసుక కొరతకు చంద్రబాబు, లోకేష్ కారణమని రోజా ఆరోపించారు. లోకేష్ ఇసుక సమస్య మీద దీక్ష చేసినట్టు లేదని, లావు తగ్గాలని డైటింగ్ చేసినట్టు ఉందని రోజా ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక ఇబ్బందితో తిండి లేక పస్తులతో రోడ్డు కుటుంబాలతో రోడ్డు నా పడ్డారని ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇసుక కొరతకు నిరసనగా నారా లోకేష్ గుంటూరు లో ఒకరోజు దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.
మరో వైపు విశాఖపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ ౩న లాంగ్ మార్చ్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ పార్టీ లు పవన్ కు మద్దతు ప్రకటించాయి.