తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో సారి వార్తల్లో నిలిచారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేస్తూ ఈ విగ్రహం అంబేడ్కర్ దే కదా అంటూ అక్కడున్న వారిని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అంబేడ్కర్ అభిమానులు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి అంబేద్కర్ కూడా తెలియరా అంటూ విమర్శలు గుప్పించారు.
Advertisements
ఇంకోవైపు రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శనలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధానిపై స్పందించమని మీడియా ప్రతినిధులు అడగటంతో రాజధాని రైతుల గురించి అయితే మీడియాతో మాట్లాడనని తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి అని ఉన్న పోస్టర్‌ను ఆమె పక్కకు నెట్టేశారు.