పవన్ కళ్యాణ్ కు ఒకచేతిలో తాళి మరో చేతిలో ఎగతాళి ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఎస్ సుధాకర్ బాబు. తాళి ఎప్పుడు కడతాడో, ఎగతాళి ఎప్పుడు చేస్తాడో ఎవరికీ తెలియదన్నారు. పవన్ ఎన్ని పుస్తకాలు చదివాడో తెలీదు కానీ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం చదువుతుంటారు. రాజకీయాల్లో పవన్ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. పార్టీ అధ్యక్షుడిగా ఓడిపోయిన పవన్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా నాటకాలు ఆడుతున్నాడు అంటూ విమర్శించారు.
పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ ఎద్దేవ చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటంబం అంటే పవన్ కళ్యాణ్ కు భయం..అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై పవన్ ఎందుకు దీక్షలు చేయలేదంటూ విమర్శించారు.
చంద్రబాబు కొడుకు రాజకీయాలకు పనికిరాడని దత్త పుత్రుడు పవన్ తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నాడు అంటూ ఆరోపించారు. రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాల్లో ఎలా కొనసాగుతున్నావంటూ విమర్శించారు.