టీడీపీ ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తుందనే విషయం వైసీపీ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. కాని వైసీపీ కూడా మరో కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేనే చెప్పేసింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇన్ఫార్మల్ గా మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేసి.. ఆమె దగ్గరే పని చేసినవాడు ఒకటి తర్వాత ఒకటి ఆడియో టేపులు లీకు చేస్తూ.. ఆమెకు ఫుల్లు టెన్షన్ పెంచేస్తున్నాడు. మొదటి ఆడియోలో తుళ్లూరు సీఐని బెదిరించిన విషయం బయటపడింది..అది కూడా ఇసుక అక్రమ రవాణా విషయంలో.. తర్వాత పేకాట శిబిరాలు పెట్టుకుందామని అడిగినట్లు వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెడ్డి కులంవాళ్లు పడనివ్వరని.. అధికారం వాళ్ల చేతుల్లోనే పెట్టుకుంటారని మేడమ్ కామెంట్ చేసింది. అది లీకు అవడంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేసి ఎల్లో మీడియా అసత్య ప్రచారం అంటూ కవర్ చేసుకోవాలని చూసింది. కాని నిజం అందరూ వినేశారు. అందరూ వినడం సంగతి వేరు.. జగనన్న వినడం వేరు.. కదా.
ఇప్పుడు జగనన్నతో పాటు.. ఆయన సామాజికవర్గం వారంతా.. పైగా పార్టీలోను, ప్రభుత్వంలోనూ పెత్తనం చేస్తున్న పెద్దరెడ్లంతా ఏమనుకోవాలి. ఈ ఉండవల్లి శ్రీదేవికి ఈసారి పొరపాటున కూడా టిక్కెట్ ఇవ్వకూడదని అనుకుని ఉంటారు. లేకపోతే చీప్ గా ఫోన్ లో పేకాట శిబిరాలు పెడదామని మాట్లాడటం.. సీఐని ఉద్యోగం ఊడుద్దని వార్నింగ్ ఇవ్వడం.. అది కూడా పాపం ఆ సీఐ మార్గం చెబుతున్నా పట్టించుకోలేదు.. ఇవన్నీ శ్రీదేవి ఇమెచ్యూరిటీని బయటపెట్టాయని అనుకుంటారు. అందుకే డబ్బులివ్వంగానే వెనకా ముందు చూడకుండా టిక్కెట్ ఇవ్వకూడదు ఈసారి అనుకుంటారు.
మరి శ్రీదేవి ఏం కావాలే.. అందుకే ఆమె అప్పుడే జగనన్నను ప్రసన్నం చేసుకునే మార్గాల కోసం.. ఎవరెవరిని కలవాలో లిస్టు వేసుకుని బిజీ అయిపోయింది. అవసరమైతే మళ్లీ టిక్కెట్ తీసుకున్నప్పుడు కన్నా ఎక్కువగా చదివించుకుని అయినా.. ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే అసలే అమరావతి పోరాటం పుణ్యమా అని ఈసారి ఓట్లు పడటం కూడా కష్టమే. అలాంటిది జగనన్నకే కోపం వస్తే ఏ పదవి లేకుండా పోతుంది. పదవిలో ఉంటూనే ఇంతలా తనను ఆడుకుంటుంటే.. రేపు పదవి లేకపోతే ఎవరు దిక్కు అనే టెన్షన్ లో పడింది.
శ్రీదేవి సంగతేమో గాని.. వైసీపీ ఏ కులానికి ప్రాదాన్యత ఇస్తుందో.. ఆ కులం నేతలు ఏం చేస్తున్నారో అనేది బయటపెట్టేసింది. ఇప్పటివరకు ప్రత్యర్ధులపై కులం ముద్ర వేస్తూ.. రంకెలేసే వైసీపీ నేతలంతా ఇప్పుడేం సమాధానం చెబుతారో చూడాలి. అసలు కులపిచ్చి ఎవరికుందో.. ఎవరికి ఎంత ఉందో కూడా.. తేలిపోయింది, మళ్లీ మళ్లీ మాట్లాడకుండా.