గుంటూరు: తాడికొండఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కులంపేరుతో టీడీపీ నేతల్ని చంద్రబాబే రెచ్చగొట్టి వదలారని ఆరోపించారు. వారందరితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. ఆమె ఏమన్నారంటే…
- కుల వివక్ష అనేది రాజధానిలో కనిపించడం దారుణం..
- సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారు.
- వినాయకుణ్ణి ముట్టుకుంటే మైల పడతాడని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు.
- రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికితీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు.
- చెప్పరాని మాటలతో టీడీపీ నేతలు నన్ను దూసిస్తున్నారు.
- గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకోరంటూ మాట్లాడారు.
- యథా రాజా తదా ప్రజా అన్నట్లు చంద్రబాబు బాటలోనే టీడీపీ నాయకులు నడుస్తున్నారు.
- టీడీపీ నాయకులకు కుల రాజకీయం తలకెక్కింది.
- రాజధానిలో వైస్సార్సీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
- రాజధానిలో వైస్సార్సీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్ కూడా పాల్పడ్డారు.
- గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని మాట్లాడారు.
- ఇంతటి కుల వివక్షను దేశంలో ఎక్కడా చూడలేదు.
- చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి.
- తనపై కుల వివక్షతకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే.
- రాజధానిలో దళితులను చిత్రవధ చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ ఒక దళిత నేతేనా.
- ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకుంటారా.
- రాజధానిలో భూములు ఇచ్చిన దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారు.
- టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరిస్థితిలో దళితులు లేరు.
- దళితులు టీడీపీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
- నన్ను దూషించిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించాలి.