మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం అమలుపై చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ఆపే ప్రయత్నం చేశారు. స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు ఇలా చేస్తే మర్యాదగా ఉండదంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని కూడా ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో వీరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. స్పీకర్ స్థానం పై చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. మరో వైపు అధికారపార్టీ కూడా చంద్రబాబును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. స్పీకర్ చైర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది వైసీపీ.