ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వివాదం కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయానికి సొంతపార్టీ లోని నేతలే వ్యతిరేకిస్తున్నారు. రాజధానిని తరలించకండని అమరావతి ప్రాంత నేతలు చెప్తుంటే మరో వైపు రాయలసీమ ప్రాంత నాయకుడు రాజధాని మా ప్రాంతంలో పెట్టండంటూ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు .
తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా రాయలసీమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాజధానిని ఎక్కువ భాగం రాయలసీమలో పెడితే మా రాయలసీమ కొంచెం అయినా అభివృద్ధి చెందుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ను రాయలసీమలో పెట్టడం వలన హోటల్స్ లాడ్జిలు పెరుగుతాయి దయచేసి రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోకండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశాడు.