బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడి తంతా అని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ చెప్పకుండా.. అది చెప్పినంత పని చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఒక్కడిని ఒక్కడిని అన్నారుగా.. ఆ ఒక్కడే ఇప్పుడు సూటిగా విమర్శలు చేస్తూ.. వైసీపీ పరువు తీస్తుంటే.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాక.. ఆ పార్టీ నేతలు దిక్కులు చూస్తున్నారు. జగనన్నకు గుడి కట్టడానికి శంకుస్థాపన పేరుతో.. సరిగ్గా అయోధ్యలో రామాలయం నిర్మాణ శంకుస్థాపన జరిగిన టైములోనే ఒక పూజను గోదావరి జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేశారు. దానిపై ఎవరూ ఊహించని విధంగా తిరుగులేని బాణాన్ని రాజుగారు వేసేశారు.
జగనన్నకు కట్టాల్సింది .. గుడి కాదు బాబూ… చర్చి అంటూ రాజుగారు సెలవిచ్చారు. గుడి కట్టి అనవసరంగా హిందువుల మనోభావాలు దెబ్బ తీయొద్దని కామెంట్ చేసి కొత్త చర్చకు దారి తీసేలా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన కుటుంబం అంతా కన్వెర్టడ్ క్రిస్టియన్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ తల్లి విజయమ్మ స్వయంగా బైబిల్ పట్టుకోనిదే ఎక్కడకు అడుగు పెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్లు అంతా బాగా ఓన్ చేసుకున్నారు. దాని నీడలో అత్యధికంగా ఉండే దళితులు సైతం అందుకే ఆయనకు మద్దతు పలికారు.
కాని ఎన్నికలకు ముందు.. స్వరూపానందస్వామి సమక్షంలో హిందూ మతం పుచ్చుకున్నట్లు వీడియోలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ఆయన క్రిస్టియన్ కాదన్నట్లే.. ఆ పార్టీ నేతలు తెలివిగా ప్రచారం చేశారు. తిరుపతి వెళ్లిన ప్రతిసారీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన జగన్.. ఇవ్వకుండానే ఆ నిబంధనను ధిక్కరించి వెళుతున్నారు. అయినా నోరు నొక్కుకోవడమే తప్ప ఎవరూ నోరు విప్పి అడిగే ధైర్యం చేయలేదు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని.. ఆయనకు గుడి కట్టడం తప్పని.. రఘురామకృష్ణంరాజు ఓపెన్ గా చెప్పి.. వైసీపీవారికి షాకిచ్చారు. ఇప్పుడు గుడి కట్టాలనుకున్నవాళ్లు ఏం చెబుతారో.. వైసీపీ దీనిని ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి మరి.
అమరావతిలో త్వరలోనే పర్యటిస్తానని.. అక్కడి రైతులకు మనోధైర్యం ఇచ్చేలా తన పర్యటన ఉంటుందని రాజుగారు తెలియచేశారు. ఎవరూ అధైర్యపడవద్దని మరోసారి చెప్పారు. బిజెపి కనుసన్నల్లో నడుస్తున్న రాజుగారికి.. హోం శాఖ నుంచి ఆయన కోరుకున్నట్లుగా వై కేటగిరీ భద్రత ఏర్పాటు కాబోతుంది. కేంద్రానికి రాజధాని విషయంలో ఎలాంటి సంబంధం లేదని.. బిజెపిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా రాజుగారు చేశారు.