
సుప్రీంకోర్టులో మూడు రాజధానుల పిటిషన్ ఇవాళ కూడా విచారణకు రాకపోవడం సంతోషకరమన్నారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. రాజధానితో నాకు సంబంధం ఏంటంటూ కొద్ది మంది పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.
నాది విజయవాడ.. నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే. అమరావతిపై మాట్లాడే హక్కు నాకు ఉంది. నూటికి నూరుపాల్లు అమరావతి ఒక్కటే రాజధాని . కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుందని అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదం రాష్ట్రపతి నిర్ణయానికి విరుద్ధంగా ఉందని కాబట్టి జగన్ నిర్ణయం చెల్లదు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ వ్యక్తి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కారణంగా అతడిని ప్రభుత్వ ఉద్యోగిగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తి పార్టీకి సోషల్ మీడియాలో ఎలా పనిచేస్తాడని ప్రశ్నించాడు.