రఘురామ కృష్ణరాజు, ఎంపీ
ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారు. ఇలాంటి సంక్షేమం ఎక్కువకాలం నిలవదు. జగన్ సర్కార్ అధికారం చేపట్టాక రూ.2.56 లక్షల కోట్ల అప్పు చేశారు. రుణాలు తెచ్చుకోవడం కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దారుణం. సీపీఎస్ రద్దు చేయకుండా, ఉద్యోగుల పీఎఫ్ లో కోత విధిస్తోంది ప్రభుత్వం. 20వ తేదీ వచ్చినా ఇంకా 20 శాతం మందికి జీతాలు పడలేదు.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే ఆదాయం అంతా సరిపోతోంది. అందుకే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని కలెక్టర్లకు చెప్పడం ఏంటి..? రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడంలేదు. సీఎం వస్తేనే మంత్రులు సచివాలయానికి వస్తున్నారు. మరో పాతికేళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా.