వైసీపీ సోషల్ మీడియా టీమ్‌పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారంతా వెదవల్లా తయారయ్యారంటూ మండిపడ్డారు. వారి ప్రవర్తన చూస్తోంటే వారిలో మానసిక రుగ్మత బాగా పెరిగిపోయినట్టుగా కనిపిస్తోందని విమర్శించారు. తనకు తీవ్ర అనారోగ్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారని రఘురామ ఫైర్ అయ్యారు.
తనకు బైపాస్ సర్జరీ విజయవంతమైందని.. తాను సంపూర్ణ ఆరోగ్యంగాగా ఉన్నానంటూ స్పష్టం చేశారు.ఇకపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలపైన తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు. తన ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారాన్ని, వదంతులను అభిమానులు నమ్మవద్దని రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.