వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం ఏర్పాటు చేసిన భారీ విందు ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ విందుకు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీనీయర్ నేతలు, ఎంపీలు కూడా హజరుకాబోతున్నారు.
ఈ విందు కోసం స్పెషల్ మెను తయారు చేయించారని తెలుస్తోంది. దాదాపు 100 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పైగా చాలా ఖరీదైన వంటకాలు తయారు చేయిస్తున్నారని సమాచారం. అందులో స్పెషల్ కిళ్ళీ ఉందని… ఒక్కో స్పెషల్ కిళ్ళీ 1000రూపాయలకు పైగా ఉంటుందని ఢిల్లీలో జోరుగా చర్చ సాగుతోంది.
ఓవైపు వైసీపీ ఎంపీ విందు ఏర్పాట్లలో బిజీగా ఉంటే… వైసీపీ నేతలు విజయసాయితో పాటు సీఎం జగన్‌కు టెన్షన్ పుట్టిస్తోందని తెలుస్తోంది. ఈ విందు తర్వాత ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు కనీసం ఐదుగురు ఎంపీలైన పార్టీ మారే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి. దాంతో వైసీపీ ట్రబుల్ షూటర్ విజయసాయి ఇప్పటికే రంగంలోకి దిగారని, ఎవరెవరు ఎంపీలు వెళ్లే అవకాశం ఉంది… వారి ఇబ్బందులు ఏంటీ, సీఎంతో మాట్లాడిస్తానని హామీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే, ఇప్పటికే ఎంపీ రఘురామ పార్టీ మారుతారని వైసీపీ కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే గోకరాజు ఫ్యామిలీని వైసీపీలోకి తెచ్చారని…పైగా వారు వచ్చింది కూడా బీజేపీ నుండే కావటంతో…ఇక ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయ సమరం మొదలైనట్లేనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీతోనే బీజేపీ దూరం అయిందని…అలాంటిది పార్టీ బలోపేతం కోసం అవగాహానతో ఉన్న వైసీపీని దెబ్బకొట్టలేదా బీజేపీ అధిష్టానం అన్న మాటలు ఇప్పుడు ఢిల్లీలోనూ, ఏపీలోనూ బలంగా వినిపిస్తున్నాయి.