రఘురామకృష్ణంరాజు దీక్ష చేసింది పెద్ద వార్త కాదు.. కాని ఇప్పుడు విసిరిన ఛాలెంజ్ మాత్రం పెద్ద వార్తే.. ఇప్పటివరకు… సీఎం జగన్ పై అటు నుంచి ఇటు నుంచి దాడే తప్ప… డైరెక్టుగా చేయలేదు. సీఎం పక్కనున్నోళ్లను తిట్టుకుంటూ వచ్చారే తప్ప.. జగన్ ని ఏమీ అనలేదు. అటు బిజెపి, ఇటు టీడీపీ.. ఎటు ఉన్నారో అర్ధం కాకుండా వ్యవహారం చేస్తూ.. ప్రతి అంశాన్ని ఎత్తుకుంటూ.. విమర్శలు కురిపిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏపీలో ఈయనేనా అనేలా చేస్తున్నాడు. ఇప్పుడు నేరుగా జగన్ కే సవాల్ విసిరారు.
నేను రాజీనామా చేస్తా.. ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా.. మరి అప్పుడు అమరావతిలోనే రాజధానిని ఉంచుతావా అని అని జగన్ ను నేరుగా ప్రశ్నించాడు రఘురామకృష్ణంరాజు. ఇప్పటివరకు వైసీపీ వారి నుంచి ఈ డిమాండ్ వచ్చేది.. రాజుగారు రచ్చబండ పెట్టి గంభీరంగా డైలాగులు కొట్టడం కాదు.. రాజీనామా చేసి గెలవాలి.. ఆయన గెలిచిందే వైసీపీ ఓట్ల మీద.. బతిమాలాడి మరీ టిక్కెట్ తీసుకున్నాడంటూ వైసీపీ నేతలు విమర్శలు కురిపించారు. కాని ఇప్పుడు బాస్ బాక్స్ బద్ధలుగొట్టేశాడు.. నేను రెడీ….మీరు రెడీయా అంటున్నారు.రాజుగారి అసమ్మతి ప్రస్థానం చూస్తే.. చాలా ప్లాన్డ్ గా.. ఆర్డనైజ్డ్ గా నడిచినట్లు అర్ధమవుతోంది. ముందు ఇళ్ల స్ధలాల అవినీతిపై బహిరంగంగా మాట్లాడారు.. ఆ తర్వాత రాజధాని గురించి.. ఇక ఆ తర్వాత వరుసగా ప్రతి సమస్యను ఎత్తుకుంటూ వచ్చారు. విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇవ్వగానే.. పార్టీ పేరు మీదే వివాదం సృష్టించారు. అంతటితో ఊరుకోకుండా.. పార్టీ అసలు ఓనర్స్ అంటూ.. వారితో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేయించారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
లోక్ సభ స్పీకర్ కు.. వైసీపీవారు లెటర్ ఇచ్చినా.. ఆయన సీటు మార్చారు తప్ప అనర్హత వేటు వేయలేదు. అనర్హత వేటుకు దొరకకుండా ఉండటానికే అన్నట్లు.. ప్రతి రోజు.. ఎన్ని విమర్శలు చేసినా.. జగన్ పై మాత్రం అభిమానం కురిపిస్తూ.. స్పిన్ బౌలింగ్ చేసేవారు. కాని నేడు మాత్రం.. ఏదో ముహూర్తం ముంచుకొచ్చినట్లు.. నేరుగా ఢీ కొట్టడానికి రెడీ అయినట్లు.. చెప్పకనే చెప్పేశారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో.. దేవాలయాలపై దాడులను అరికట్టాలని.. విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్మపరిరక్షణా దీక్షను ఢిల్లీలో రాజుగారు చేశారు. ఇక్కడ కూడా ఆయన తెలివి చూపించారు. బిజెపి, జనసేన నేతలు దీక్ష చేసినప్పుడు చేసి.. వారిలో కలిసిపోకుండా.. విడిగా సెపరేటుగా.. ఢిల్లీలో చేశారు.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని నేరుగా డిమాండ్ చేసి.. సెన్సేషన్ కామెంట్స్ వదిలారు. రాజీనామా చేయడమే కాదు.. గెలిచాకే.. అమరావతిని రాజధానిగా పెట్టాలని చాలెంజ్ చేశారు. మరి వైసీపీ నేతలు ఈ ఛాలెంజ్ కి ఎలా రెస్పాండ్ అవుతారో.. మళ్లీ ఎలాంటి కౌంటర్లిస్తారో చూడాలి.