అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను ఇరికించాలన్న సీఎం జగన్ ఉద్దేశం సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టారు వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణం రాజు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందో లేదో ప్రభుత్వం నుండి తెలుసుకోవచ్చు కానీ చర్యలు తీసుకోవటం ఇప్పుడున్న చట్టాలతో సాధ్యం కాదని అందుకు చట్టాలు మార్చాలని వైసీపీ ఎంపీ సూచించారు.
టీడీపీ హయంలో అమరావతి ప్రాంతంలో ముందుగానే టీడీపీ నేతలు భారీగా భూములు కొన్నారన్న అంశంపై జగన్ సర్కార్ విచారణకు సిద్ధమయింది. దీనిపై న్యాయ సలహ తీసుకొని సీబీఐ ద్వారా విచారణ చేయాలా, రాష్ట్ర సంస్థతో విచారణ చేయించాలో నిర్ణయిస్తాం అంటూ క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
దిశ చట్టం ఉండగా నిర్భయ ఎందుకు ?
Advertisements
అమరావతి ఎప్పటికీ ప్రజా రాజధానే