వైసీపీ ఎంపీ విజయసాయి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సీఎం జగన్, కేసీఆర్‌ల మధ్య లంచ్ మీటింగ్ కోసం జగన్ కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ చేరుకున్నారు. సీఎం జగన్ తో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు వచ్చారు. వీరికి సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ సంతోష్‌లు స్వాగతం పలికారు.
సీఎం జగన్‌ను తన వెంటపెట్టుకొని కేసీఆర్ ఇంట్లోకి వస్తున్న సందర్భంలో ఎంపీ విజయసాయి, కేసీఆర్ ఎదురుపడ్డ సందర్భంలో… కేసీఆర్‌తో ఎదో మాట్లాడుతూ విజయసాయి కేసీఆర్ కాళ్లు మొక్కారు. దీంతో విజయసాయి కాళ్లు మొక్కటంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Advertisements
సీఎం కేసీఆర్ ముందు వైసీపీ, జగన్ మొకరిల్లిందని కొందరు… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.