ఎమ్మెల్యే.. ఎంపీ.. మధ్యలో పోలీస్ - Tolivelugu

ఎమ్మెల్యే.. ఎంపీ.. మధ్యలో పోలీస్

గుంటూరు : నిజాయితీగా పనిచేస్తే పొలిటీషియన్లు మధ్యలో దూరి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ పోలీస్ అధికారి చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘ఆడవాళ్ళని వేధించిన వారిని శిక్షించే హక్కు లేదా’ అంటూ ఈ అధికారి వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇది రాజధాని గ్రామంలో జరిగినట్టు చెబుతున్నారు. సచివాలయం కొలువుదీరిన వెలగపూడికి అతి సమీపంలోని మందడం గ్రామంలో ఇది జరిగిందని తెలుస్తోంది. మందడం గ్రామానికి చెందిన ఓ వివాహితను కొంతమంది యువకులు వేధింపులకు గురి చేస్తున్నారట. వాట్సప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నారని కథనం. ఒక రోజు భార్య, భర్త కలిసి ఓ బైకుపై వెళుతుంటే ఆపి అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి ఆమెపపై లైంగికంగా దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి… వారి మొబైల్ ఫోన్లో లభించిన ఆధారాలు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వాయిస్ రికార్డ్స్.. అస్యభ్య కరమైన మెస్సేజ్‌లు పోలీసులు సేకరించారని, అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ దీనిపై సీఐకి ఫోన్ చేసి మా వాళ్లని వదిలిపెట్టండని వత్తిడి తెచ్చారని సమాచారం. ‘ఇటువంటి కేసుల కోసం ఫోన్ చేయొద్దు సార్’ అని ఆ ఎంపీకి సీఐ సున్నితంగా చెప్పాడని, తరువాత నిందితుల్ని తీసుకొచ్చి పోలీసులు లాఠీతో కొట్టి కౌన్సెలింగ్ ఇచ్చారని కథనం. తర్వాత వీరిని హాస్పిటల్‌కి తీసుకెళ్లి పోలీసులు చావ బాదినట్టుగా మెడికల్ రిపోర్ట్స్ తెప్పించారని ఆరోపణ. ఇవే రిపోర్ట్స్ పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లి ఆ ఎంపీ.. ఆ ఎమ్మెల్యే మా వాళ్లమీద కావాలనే కేసులు పెట్టించి ఈ విధంగా చావ కొట్టిస్తుందని ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే ఆ సీఐ, ఎస్‌ఐలపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని కథనం.
‘అమ్మాయిల్నివేధించే వాళ్లని పోలీసులు శిక్షించడం తప్పు.. అమ్మాయిల్ని వేధించే నిందితుల్ని కాపాడటం కోసం నాయకులు ఫోన్ చేయడం ఒప్పు..’ అంటూ ఇప్పుడు ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.

, ఎమ్మెల్యే.. ఎంపీ.. మధ్యలో పోలీస్

Share on facebook
Share on twitter
Share on whatsapp