విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా జగన్ ప్రకటించటం విశాఖ ప్రజలకు గొప్ప బహుమతి అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని ప్రకటన తరువాత విశాఖలో పర్యటించిన విజయసాయిరెడ్డి మీడియా తో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖ ప్రకటన తర్వాత తొలిసారిగా జగన్ ఈ నెల 28న విశాఖ పర్యటకు వస్తున్నారు.
ఈ సందర్భంగా విశాఖ వాసులు తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ ఎయిర్ పోర్ట్ నుంచి నగరం వరకు మానవహారం నిర్వహిస్తున్నాము. విశాఖలో విఎంఆర్డీఏ, జివిఎంసి కు చెందిన పలు అభివృద్ధి కార్య క్రమాలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. విశాఖ ఉత్సవ్ లో లేజర్ షో , ప్రముఖ సాంస్కృతిక ప్రముఖులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నాకు విశాఖలో ఒక ప్లాట్ మాత్రమే ఉంది. మరే ఇతర ఆస్తులు నాకు లేవు, నేను ఎవరితో భాగస్వామ్యం లేదంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.