తెలుగు ఉద్యమకారుడి అవతారమెత్తిన మాలోకానికి నిశ్చితార్దానికి,పెళ్ళికి కూడా తేడా తెలియట్లేదన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. గతం లో వర్ధంతికి, జయంతికి తేడా తెలీకుండా మాట్లాడి అబాసుపాలైన లోకేష్ కామెడీ పంచటంలో మాత్రం ముందున్నారంటూ విమర్శించారు. బాబు చెప్పిన పనిని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ శ్రద్దగా చేసుకుంటుంటే, లోకేష్ మాత్రం కామెడీ పంచుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. నిత్య కళ్యాణం కామెంట్లు చూస్తుంటే బీజేపీలో విలీనానికి తెగ ఆరాట పడుతున్నట్టు తెలిసిపోతోంది.
ప్రయత్నం లోపంలేకున్నా అసలు చెల్లని కాసు పార్టీలను కలుపుకునేందుకు బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు.