ఏపీ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన వీరిద్దరూ జిల్లాకు చేసిందేమి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా జిల్లా రూపురేఖలను మార్చలేకపోయారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న అమ్మ ఒడి పథకంలో పాల్గొన్న రోజా… కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు చిత్తూర్ జిల్లాకు చెందిన వారు అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా వ్యవహరించారన్నారు. అ అంటే అమ్మ ఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనేంతలా జగన్ కృషి చేస్తున్నారని ప్రశసంల జల్లు కురిపించారు.
టీడీపీ అధినేత తాను చదువుకున్న పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడేలా చేయడం జగన్ కు సాధ్యమైందని చెప్పుకొచ్చారు.