ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అభివృద్ధి చేశామంటూ అధికారపక్షం చెప్తుంటే మరో రంగు వెయ్యటమే గా మీరు చేసిన అభివృద్ధి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి మధ్య కొత్తగా ఇప్పుడు మరో అంశం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మార్కెట్ లో కొత్త రకం గేదెలు… వైసీపీ గేదెలు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే గుడి, బడి, జాతీయజండా, గాంధీ విగ్రహం అన్ని అయిపోయాయి. ఇప్పుడు ఆఖరికి గేదెలను కూడా వదలట్లేదా మీరూ అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ ఇలా రంగులు వెయ్యటం చూడలేదు అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరి ఈ రంగు వేసే పథకం పెద్దలు చెప్తే జరుగుతుందా లేక కార్మికులు ప్రేమతో చేస్తున్నారా అనే సంగతి మాత్రం తెలియట్లేదు.