ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రంగుల రాష్ట్రం గా తయారయ్యింది. బడి,గుడి అని పట్టించుకోకుండా పార్టీకి సంబందించిన రంగులు వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, కరెంటు పోల్ ఇలా ఏది కనిపిస్తే దానికి రంగులు వేస్తూనే ఉన్నారు. ఆఖరికి స్మశానం లో ఉన్న సమాధులను కూడా వదల్లేదు. తాజాగా సమాధికి కూడా వైసీపీ రంగులు వేస్తున్న ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో ని చూసిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం లో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతుంటే ఈ రంగులు గోల ఏంటంటూ జగన్ పై ఫైర్ అవుతున్నారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే రంగులు వేస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు అంత స్పందించట్లేదు. అధినేత చెప్తేనే ఇలా చేస్తున్నారా లేక వారి అభిమానంతో చేస్తున్నారా అనే సంగతి మాత్రం తెలియట్లేదు.