ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వెనక్కు తగ్గారు. సోమవారం నాడు సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం నాటి సభలో వివరణ ఇచ్చారు.
‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని అగౌరవ పరచాలని ఏ మాత్రం అనుకోలేదు. నేను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. ఆవేశంలో మాట్లాడాను.. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇస్తున్నా’ అంటూ విజయసాయిరెడ్డి సభాముఖంగా క్షమాపణలు కోరారు.
కాగా నిన్న ఓ సందర్భంలో ‘మీ మనసు బీజేపీపైన.. తనువు టీడీపీపై..’ అని విజయసాయి రాజ్యసభ చైర్మన్ సీటులో ఉన్న వెంకయ్య నాయుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఈ ఉదయం వివరణ ఇచ్చారు.